సిద్దిపేట కళా నిలయానికి..సాహిత్య సౌరభానికి మరో వేదిక

మొన్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంగా కోమటి చెరువు కళాక్షేత్రం... రేపు ఇండోర్ ఆడిటోరియం టౌన్ హల్ సిద్దిపేట కు విపంచి కళా వేదికగా నిలువనుంది. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో టౌన్ హాల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.5కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన టౌన్ హాల్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. కవులు, కళాకారులు, రచయితలు, చిత్రకారులు, సాహిత్య ఔత్సాహికులైన పుట్టినిల్లు సిద్ధిపేటలో వేదిక ఉండాలని మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో టౌన్ హాల్ నిర్మించారు.


జీ+2 అంతస్తులో భవన నిర్మాణం పూర్తి అయ్యింది. వాహనాలు నిలిపేందుకు 100 టూ వీలర్స్, 30 కారు పార్కింగ్ సదుపాయాలు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. మొదటి అంతస్తులో ఏసీ హాల్ వేదిక 340 మంది కూర్చునే సీటింగ్ ఎర్పాటైంది. టాకీసులో సినిమా చూసిన అనుభూతి వీక్షకులకు కలుగుతుంది.